Saturday, May 18, 2024

నాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.. అయినా డోంట్‌వ‌ర్రీ అంటున్న అడ‌వి శేష్‌..

టాలీవుడ్‌ నటుడు, బ్యాక్ టూ బ్యాక్ యాక్ష‌న్ త్రిల్ల‌ర్ సినిమాల‌తో హిట్ లు అందుకున్న హీరో అడివి శేష్ క‌రోనా బారిన పడ్డాడు. కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న శేష్‌ క‌రోనా నిర్ధ‌ర‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ విషయాన్ని అతడే తన ట్విట్ట‌ర్‌ అకౌంట్‌ ద్వారా తెలియ‌జేశాడు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం రిలీజైన రెండు టాలీవుడ్‌ సినిమాలు బింబిసార, సీతా రామం గురించి చెబుతూ.. “ఇవాళ ఉదయమే కల్యాణ్‌రామ్‌ బింబిసారతోపాటు నా ఫ్రెండ్స్‌ సుమంత్‌, దుల్కర్‌ సల్మాన్‌, మృనాల్‌ నటించిన సీతా రామం బ్లాక్‌బస్టర్‌ టాక్ విన్నాను. ఇది కదా కావాల్సింది. కొవిడ్‌ వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నా. నా కోసం మార్నింగ్‌ షో ఒక సినిమా.. మ్యాటినీ ఒక సినిమా కుమ్మేయండి” అని చెబుతూ.. చివర్లో తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించాడు అడివి శేష్ ..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement