Tuesday, May 21, 2024

మహిళలు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాల్సిందే

తెలంగాణ ఆర్టీసీ మహిళల కోసం ఓ కొత్త వెసులుబాటును కల్పించింది. రాత్రి 7.30 గంటల తరువాత మహిళలు ఎక్కడ చెయ్యి ఎత్తి బస్సులు ఆపినా ఆర్టీసీ బస్సు ఆపాలనే వెలుసుబాటును కల్పించింది. దీనికి సంబంధించిన ఆర్టీసి డ్రౌవర్లకు..కండక్టర్లకు ఆదేశాలు జారి చేసింది. ఈ వెసులుబాటులో ఇబ్బందులు ఎదురైతే మహిళలు 99592 26160, 99592 26154 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 వరకు బస్లు నియంత్రణ అధికారాలుండేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్‌లను ఆదేశించినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే పైన తెలిపిన నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఆర్టీసి కల్పిస్తున్న ఈ వెసులుబాటును మహిళలు వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నరేంద్ర మోదీ కేబినెట్‌లో కొత్తగా 43 మంది మంత్రులు

Advertisement

తాజా వార్తలు

Advertisement