Monday, April 29, 2024

HYD | దీపావళి బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు..

దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సిటీ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో భారీ శబ్దం వచ్చే టపాసులు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని నోటీసులు సూచించారు. నివాస ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి 10 గంటలకు మాత్రమే కాల్చలని ఆదేశించారు.

పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం నేపథ్యంలో సాధారణ టపాసులకు బదులుగా గ్రీన్‌ కాకర్స్‌తో పండగను జరుపుకోవాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ శాండిల్య హెచ్చరించారు. పర్యావరణ అనుకూలంగా, సురక్షితంగా పండగను జరుపుకోవాలని, మార్గదర్శకాలను అందరూ పాటించి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement