Wednesday, May 1, 2024

గ‌ణేష్ నిమ‌జ్జ‌నాల‌కు భారీ ఏర్పాట్లు

భాగ్యనగరంలోని గణేష్ నిమజ్జనాలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే హుస్సేన్‌సాగర్ లో గణేష్‌ నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందు కోసం జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్‌పై 15 క్రేయిన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీవీ మార్గ్, పిపుల్స్ ప్లాజాలో 8 క్రేయిన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్‌లో అన్ని రకాల గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిన్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 354 కిలో మీటర్ల మేర గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగనుంది. 168 గణేష్ యాక్షన్ బృందాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. 10 వేల మంది శానిటేషన్ సిబ్బందిని బల్దియా నియమించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 74 ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులో 28 శాశ్వత కొలనులు కాగా 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబి పాండ్స్ ఏర్పాటు చేయగా, మరో 22 చోట్ల గ్రౌండ్ పాండ్స్‌ను సిద్ధం చేశారు. గణేష్ నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement