Friday, May 3, 2024

ఇదేం గెటప్ప్ రా బాబోయ్..

సినిమాలు అన్నాక పలు రకాల పాత్రలు వేయడం సహజమే. అలాగే ఓ డిఫరెంట్ గెటప్ప్ లో కనిపించాడు హాలీవుడ్‌ నటుడు జాన్‌ సినా.. థైస్ వరకే ఉండే పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్టార్‌ రెజ్లర్‌ అయిన జాన్‌ సినా మహిళలా పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులు, మోకాళ్లదాకా సాక్షులు ఎందుకు ధరించాడని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ‘రికీ స్టానికీ’ అనే ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారు. ఆ కామెడీ సినిమాలో తను పోషించబోయే పాత్ర కోసం జాన్‌ సినా మూవీ సెట్‌లో అలా విచిత్ర వేషధారణలో కనిపించాల్సి వచ్చింది. ఆ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు ఎలా స్పందించాలో తెలియక నెత్తులు గోక్కుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement