Saturday, April 20, 2024

షూటింగ్ లో తెలంగాణకు కాంస్య పతకం.. ప్రతిభ చాటిన మేఘ‌న‌

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. శనివారం న్యూఢిల్లీలోని కర్ని సింగ్ షూటింగ్ రేంజ్ లో నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ మహిళా విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని మేఘన సాధుల కాంస్య పథకం సాధించింది. అంతర్జాతీయ క్రీడాకారులను వెనక్కి నెట్టి మేఘన సాధుల కాంస్య పథకం సాధించడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీకి కాంస్య పథకం తెచ్చిన మేఘనను వైస్ ఛాన్స్ ల‌ర్ తో పాటు ప్రొఫెసర్లు అభినందించారు. ఇటీవల భోపాల్ లో జరిగిన జాతీయస్థాయి షూటింగ్ పోటీల్లో మూడు పథకాలు సాధించింది. మేఘన ఇప్పటికే ఇండియన్ షూటింగ్ టీంకు ఎంపికైన విషయం విధితమే. ఇటీవల ఖేలో ఇండియాకు సైతం మేఘన ఎంపికైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement