Monday, May 6, 2024

Hockey Nationals | ఉత్కంఠ ఫైనల్లో హర్యానాపై పంజాబ్‌ విజయం

13వ జాతీయ సీనియర్‌ పురుషుల హాకీ టోర్నీ చాంపియన్‌గా పంజాబ్‌ జట్టు నిలిచింది. మంగళవారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో పంజాబ్‌ పెనాల్టి షూటౌట్‌లో 9-8 గోల్స్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ హర్యానాపై గెలిచింది. దాంతో పంజాబ్‌ 4వ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొదట్లో ఇరు జట్లు పూర్తి సమయం ముగిసే సమయానికి 2-2 గోల్స్‌తో సమానంగా నిలిచాయి.

దాంతో స్కోరు డ్రా అవడంతో ఫలితం కోసం పెనాల్టి షూటౌట్‌ వెల్లాల్సి వచ్చింది. షూటౌట్‌లోనూ ఇరూ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తలో గోల్స్‌ సాధిస్తూ పోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖర్లో పంజాబ్‌ జట్టు ఆధిక్యంలో దూసుకెళ్లి విజేతగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement