Friday, October 4, 2024

HYD: హైదరాబాద్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించిన సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్

హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్, ఒమన్‌తో కలిసి, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మద్దతుతో ఒమన్‌లోని వివిధ వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించింది. ప్రతీక్ లునావియా, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ – ఇండియా, సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ విదేశీ కంపెనీలకు పోర్ట్, ఫ్రీ జోన్ అందించే బహుళ ప్రయోజనాలు అండ్ ప్రోత్సాహకాల అవలోకనాన్ని అందించారు.

ఈసందర్భంగా విమోనోవా ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్.లిమిటెడ్, అసోచామ్ సదరన్ రీజియన్ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్యానెల్ అండ్ సీఈఓ, కన్వీనర్ డాక్టర్ రంగయ్య వి సేట్లెం మాట్లాడుతూ… సుల్తానేట్ ఆఫ్ ఒమన్ భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అరబ్ లీగ్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఫోరలలో ముఖ్యమైన సంభాషణకర్త అన్నారు. తాము తమ సంబంధాల మధ్య నిర్వచించదగిన పరివర్తనను చూస్తున్నామన్నారు. దక్షిణ ప్రాంతం ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉందన్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా ఉద్భవించిందని, ఔషధ రంగానికి, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement