Sunday, May 5, 2024

Hit Combo – క్రాక్ కాంబినేష‌న్ మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది….

మాస్‌ మహారాజా రవితేజ, గోపీచంద్‌ మలినేని మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కలయికలో డాన్‌ శీను, బలుపు , క్రాక్‌ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్‌, పవర్‌ ఫుల్‌ కథతో ఈ చిత్రం రూపొందనుంది. కొన్ని నెలల క్రితం పోస్టర్‌ ద్వారా సినిమా ప్రకటించారు. తాజాగా చిత్రబృందం మరిన్ని విషయాలు తెలియజేయనుంది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్‌ థమన్‌ సంగీతం అందించనున్నారు. క్రాక్‌, బిగిల్‌, మెర్సల్‌, ఇటివలే ‘జవాన్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పని చేసిన డీవోపీ జికే విష్ణు.. ఈ చిత్రంతో మరోసారి రవితేజ, గోపీచంద్‌ మలినేనితో కలిసి పని చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement