Friday, May 3, 2024

నేరుగా ఓటీటీలో వస్తున్న U-టర్న్ హిందీ రీమేక్..

పవన్ కుమార్ దర్శకత్వం వహించిన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ U-టర్న్. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇక, ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు నిర్మించారు. కాగా, ఇప్పుడు అదే టైటిల్‌తో (యూ-టర్న్) హిందీలో రీమేక్ చేస్తున్నారు మేకర్స్.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలయ ఎఫ్ సమంత పాత్రను పోషిస్తుండగా, కొత్త దర్శకుడు ఆరిఫ్ ఖాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల (ఏప్రిల్) 28న Zee5లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్‌ కానుంది. యు-టర్న్ హిందీ వెర్షన్‌లో ప్రియాంషు పైన్యులీ కీలక పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement