Monday, April 29, 2024

దెందులూరులో హై టెన్షన్‌, సోషల్‌ మీడియా పోస్టింగ్‌తో కలకలం.. వైసీపీ, టీడీపీ వ‌ర్గాల‌ దాడులు..

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి జిల్లాల్లో మరో అలజడి రేగింది. కోనసీమ జిల్లా అమలాపురంలో ఇటీవల చెలరేగిన అల్లర్ల ఉదంతం మరువకుండానే.. ఏలూరు జిల్లా దెందులూరులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న విభేదాల నేపధ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పోస్టింగ్‌లు కలకలం రేపాయి. దీంతో దెందులూరులో హైటెన్షన్‌ నెలకొంది. ఫేస్‌బుక్‌లో వెలువడిన పోస్టుల నేపధ్యంలో వైసీపీ, టీడీపీ వరీ ్గయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. వ్యవహారం దెందులూరు పోలీసు స్టేషన్‌కు చేరుకోగా.. అదుపు తప్పిన ఇరు పారీ ్టల కార్యకర్తలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈఘటనలో ఎస్‌ఐతో సహా ఇరువర్గాల కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో పరిస్ధితి అదుపుతప్పడంతో భారీగా పోలీసు బలగాలు మోహరి ంచాయి. మంగళవారం రాత్రి నుంచి గ్రామంలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిస్ధితి సద్దుమణిగినా బుధవారం కూడా ఇదే వాతావరణం నెలకొనడంతో పోలీసు అధికారులు 144సెక్షన్‌ విధించారు.

దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్‌ అనే వ్యక్తులు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, అధికార పార్టీ మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని మరికొందరిపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు పారీ ్టలకు చెందిన స్ధానిక కార్యకర్తల నడుమ రాజకీయ కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో పార్టీ మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోపణలు ఎ దుర్కొంటున్న మొర్ల వరకృష్ణను స్టేషన్‌కు పిలిపించారు. అతనితోపాటు వందల సంఖ్యలో ఆ పారీ ్ట కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో మరోవైపు వైసీపీ తరుఫున కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు వచ్చారు. వ్యవహారం కొనసాగుతుండగానే వాగ్వివాదం తలెత్తిన నేపధ్యంలో ఇరువర్గాలు కళ్ళలో కారం చల్లుకుని కర్రలు, రాళ్ళతో పరస్పర దాడులకు దిగారు. పరిస్ధితి అదుపుతప్పడంతో అడ్డు వెళ్ళిన ఎస్‌ఐ వీర్రాజుతోపాటు ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. అర్ధరాత్రి వరకూ పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోికి దిగి ఎట్టకేలకు అదుపు చేశారు. మరోవైపు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వారిని పరామర్శించారు.

ఇరువర్గాలపై కేసులు నమోదు..

ఈఘటనలో తెలుగుదేశం, వైసీపీ వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాంబాబు అనే వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత మహేష్‌తోపాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కామిరెడ్డి నానితో పాటు మరో ఆరుగురు కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేశారు. జరిగిన ఘటనను పురస్కరించుకుని ఇరు వర్గాలపై బెయిల్‌బుల్‌, నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు ఘర్షణపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ స్పందించారు. పోలీస్‌ సే ్టషన్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తలు కొట్టారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన పోలీసులపై కూడా కేసులు నమోదు చేయాలని, ఘర్షణకు కారకులైన వారిని అరెస్టు చేయాలని, లేకుంటే జిల్లా కలెక్టరేట్‌తోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా దెందులూరులో ఉద్రిక్తతల నేపధ్యంలో చింతమనేనిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. దీనిపై ఆయన పోలీసుల చర్యలమీద ఫైర్‌ అయ్యారు. కోర్టు వాయిదాకు వెళ్ళాల్సి ఉన్నా క దలకుండా నిర్భంధించడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న ఆంక్షలు, బలగాల మోహరింపు
కాగా పోలీస్టేషన్‌ వద్ద వైసీపీ, టీడీపీ ఘర్షణను పురస్కరించుకుని దెందులూరులో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. స్ధానిక జిల్లా పోలీసులతోపాటు, కృష్ణాజిల్లా నుంచి కూడా అదనపు బలగాలు రప్పించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ స్వయంగా రంగంలోకి దిగి పరిసి ్ధతి పర్యవేక్షించారు. గ్రామంలో 144సెక్షన్‌ అమల్లో ఉందని, గుంపులుగా చేరవద్దని మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. గ్రామ పరిధిలో పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బయటనుంచి ఎవరూ ప్రవేశించకుండా నిఘా క ట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యగా గ్రామాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement