Monday, April 29, 2024

Delhi: టిఎంసి మాజీ ఎంపి మ‌హువాకు హైకోర్టు షాక్… ప్ర‌భుత్వ బంగ్లా ఖాళీ…

లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

దీంతో ఇవాళ బంగ్లా ఖాళీ చేయడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ విభాగ అధికారులు ఆ ప్రభుత్వ బంగ్లాకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. కాగా, లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని.. అలాగే, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు పేర్కొనింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం లభించడంతో డిసెంబ‌ర్ 8వ తేది ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి సభ నుంచి బహిష్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement