Friday, May 3, 2024

కుక్కను వెతికి తెస్తే రూ.లక్ష ఇస్తామని ప్రకటించిన హీరోయిన్

హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త‌మ కుక్క త‌ప్పిపోయింద‌ని, దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.ల‌క్ష ఇస్తామ‌ని సదరు పోస్టులో నిధి అగర్వాల్ ప్ర‌క‌టించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబ‌రును ఆమె పోస్ట్ చేసింది. దీంతో కుక్కను తెచ్చి ఇస్తే లక్ష రూపాయలా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమా కెరీర్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఊపందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో ఆమె న‌టించిన‌ రెండు సినిమాలు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో పాటు పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement