Sunday, April 28, 2024

హిమాలయాలకు వెళ్లిన హీరోయిన్ జ్యోతిక

హీరోయిన్ జ్యోతిక ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వతాల‌కు వెళ్లింది. అక్కడి ప్ర‌కృతి అందాల‌తో దిగిన ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో ఆమె చేసిన తొలి పోస్ట్ ఇదే. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న అక్క‌డ‌కు వెళ్లాన‌ని ఆమె తెలిపింది. త‌న చేతిలో జాతీయ జెండాను ప‌ట్టుకుని కూడా ఆమె ఓ ఫొటో తీసుకుంది.

మరోవైపు క‌శ్మీర్‌లోని స‌ర‌స్సుల మ‌ధ్య దిగిన ఫొటోల‌నూ ఆమె పోస్ట్ చేసింది. బికాత్ అడ్వెంచ‌ర్స్ టీమ్‌లోని స‌భ్యుల‌తో ఆమె ఈ యాత్ర చేప‌ట్టింది. త‌న లాక్‌డౌన్ డైరీలోంచి కొన్ని మంచి అంశాల‌ను పోస్టు చేస్తున్నాన‌ని చెప్పింది. జీవితం వాస్త‌విక‌మైంద‌న్న విష‌యం జీవితాన్ని అస‌లైన విధంగా జీవించ‌డం ప్రారంభించాకే తెలుస్తుంద‌ని ఆమె హిత‌వు ప‌లికింది. ఆమె దిగిన ఫొటో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: రాజ్‌కుంద్రాతో విడాకులు తీసుకోనున్న శిల్పాశెట్టి

Advertisement

తాజా వార్తలు

Advertisement