Friday, April 26, 2024

ధ‌మాకా విజ‌యాన్ని మ‌ర్చిపోలేను.. ట్వీట్ చేసిన ర‌వితేజ‌

థ‌మాకా విజ‌యం త‌న‌కి మ‌ర్చిపోలేని ఆనందాన్ని క‌లిగించింద‌న్నారు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా న‌టించింది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు . ఈ సక్సెస్ ను గతేడాదిలో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నారు. పోయిన్ ఏడాది ఎంతో కష్టంగా గడిచింది. కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగేలా చేసింది. ఈరోజు మంచి.. రేపు సంవత్సరం కూడా బాగుంటుంది. అంటూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతుంది.కాగా ధ‌మాకా సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement