Thursday, May 2, 2024

గ‌డ్డం..స్టైయిల్ హెయిర్ క‌ట్టులో మెరిసిన రామ్ చ‌ర‌ణ్

అమృత్‌స‌ర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న RC15 చిత్రం. ప్ర‌స్తుతం ఈయ‌న సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘#RC15’ చేస్తున్నాడు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలున్నాయి. తాజాగా ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ లుక్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా ఈ వీడియో చ‌ర‌ణ్ గడ్డంతో.. స్టైయిల్ హేయిర్ క‌ట్టుతో క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుత ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెర‌కెక్కుతుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, న‌వీన్ చంద్ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement