Saturday, May 4, 2024

ర‌జ‌నీకాంత్ చిత్రానికి జైల‌ర్ టైటిల్ – పోస్ట‌ర్ రిలీజ్

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు నెల్స‌న్‌తో చేతులు క‌లిపాడు .. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి ‘జైల‌ర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఒక చైన్‌కు ర‌క్త సిక్త‌మైన క‌త్తిని వేలాడ‌దీశారు. ఈ ఒక్క పోస్ట‌ర్‌తోనే మేక‌ర్స్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌రాయ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ర‌మ్య‌కృష్ణ‌, శివ‌రాజ్‌కుమార్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ వంటి అగ్ర న‌టులు కీల‌కపాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement