Friday, May 3, 2024

నితిన్ కొత్త చిత్రం.. గుబురు గెడ్డం..స్టైలిష్ లుక్ తో అద‌ర‌గొట్టిన హీరో

వక్కంతం వంశీ తెర‌కెక్కిస్తున్న మూవీలో న‌టిస్తున్నాడు హీరో నితిన్.ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. కాగా ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్‌ నుంచి ఓ స్టిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు నితిన్‌. గుబురు గడ్డం, స్టైలిష్ గాగుల్స్‌ తో బ్లాక్‌ షర్ట్‌ వేసుకుని వుడ్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తూ.. సైడ్‌ లుక్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజు ఇచ్చాడు నితిన్‌. నితిన్‌ ఈ ఒక్క లుక్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరో నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనుంది వంశీ అండ్ టీం. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement