Monday, April 29, 2024

నాగ‌చైత‌న్య 22వ సినిమా-ఆస‌క్తిగా పోస్ట‌ర్

యంగ్ హీరో నాగ‌చైత‌న్య 22వ సినిమాని ఎనౌన్స్ చేశారు.ఈ మేర‌కు పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేశారు.శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ధూత’ అనే హార‌ర్‌ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ సిరీస్ షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే నాగ‌చైత‌న్య త‌న నెక్స్ట్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. ఇటీవ‌లే ‘మానాడు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓ బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది. ఈ సినిమా షూటింగ్ బుధ‌వారం ప్రారంభం కానున్న‌ట్లు ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రీ లుక్ పోస్ట‌ర్‌తోనే సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement