Friday, October 4, 2024

దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా స‌మంత‌..!

సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న హీరో దుల్కర్ స‌ల్మాన్ తదుపరి తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈ హీరో ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు దుల్కర్ సల్మాన్. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నట్లు సమాచారం. చాలా రోజుల క్రితమే సమంతను కలిసి దర్శకుడు కథ వినిపించినట్లు తెలుస్తోంది. సమంత కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement