Wednesday, May 1, 2024

ద‌స‌రా మూవీ నుండి – ధూమ్ దాం దోస్తాన్ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

ద‌స‌రా మూవీని తెర‌కెక్కిస్తున్నాడు డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల . హీరోగా నాని న‌టిస్తుండ‌గా ..హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ధూమ్ దాం దోస్తాన్ అంటూ సాగే ఈ సాంగ్ ను దసరా రోజు రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది.
ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement