Friday, April 19, 2024

దుల్క‌ర్ స‌ల్మాన్ చిత్రంలో – కీల‌క‌పాత్ర‌లో హీరో సుమంత్

హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం సీతారామం..ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ని పోషిస్తున్నారు మ‌రో హీరో సుమంత్..
ఈ మేర‌కు సుమంత్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ పాత్ర‌లో సుమంత్ న‌టిస్తున్నారు. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో సుమంత్ ఆర్మీ అధికారిక‌గా మీసం క‌ట్టుతో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ పోస్టర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌స్తుంది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో దుల్క‌ర్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టిస్తుంది. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్టు 5న విడుద‌ల కానుంది. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement