Monday, April 29, 2024

బాల‌కృష్ణ కోసం డ్యాన్స్ చేసిన వృద్ధురాలు-వైర‌ల్ గా వీడియో

ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్ష‌న్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా బాల‌కృష్ణ న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ క‌ర్నూల్‌లో జ‌రుగుతుంది. బాల‌య్య అనే సాంగ్ షూట్ జ‌రుగుతోంది. కాగా బాల‌య్య‌ను చూడ‌టానికి క‌ర్నూల్ ప్ర‌జ‌లు తండోప తండాలుగా వ‌చ్చారు. జై బాల‌య్య అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ వృద్థురాలు కూడా బాల‌య్య‌ను చూడడానికి వ‌చ్చింది. అంతేకాకుండా ఆవిడ‌ ఈల‌లు గోల‌లు చేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జై బాల‌య్య‌’, ‘అన్న‌గారు’ అనే రెండు టైటిల్స్‌ను ప‌రిశీల‌న‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement