Saturday, May 4, 2024

18 పేజెస్ గ్లింప్స్ చూసారా..

నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా కనిపించనున్న చిత్రం ’18 పేజెస్’. సుకుమార్ అందించిన కథతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ’18 పేజెస్స సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. గతంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకు సుకుమార్ కథ అందించగా… పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత వాళ్లిద్దరూ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. కాగా.. ఈ రోజు ఈ సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు మేక‌ర్స్.

గ్లింప్స్‌ చూస్తే… ‘నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది… ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు! ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు అని’ అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ‘నన్నయ్య రాసిన కావ్యం ఆగితే… తిక్కన తీర్చేనుగా! రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా’ అంటూ చక్కటి నేపథ్య గీతం వచ్చింది.

’18 పేజెస్’ సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement