Saturday, May 4, 2024

Monsoon | రాష్ట్రంలో ఊపందుకున్న వర్షాలు.. 18 నుంచి అల్పపీడనం

అమరావతి, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో సగటు- సముద్ర మట్టము పై 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణము వైపు వంగి ఉంటున్నది. ఈ ఆవర్తనం రానున్న 2 -3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖాన్డ్‌ గుండా ప్రయాణించనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈనెల 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ఫలితంగా ఈనెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్రలో గడిచిన రెండు మూడు రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement