Thursday, April 25, 2024

వ‌చ్చే 48గంట‌ల్లో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు..

ఏపీ, తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా వ‌చ్చే 48గంట‌ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్ల‌డించింది. హైద‌రాబాద్ , రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో నిన్న ఉదయం నుంచి చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. జ‌గ‌ద్గిరిగుట్ట ప‌రిధిలో అత్య‌ధికంగా 4.5 మిల్లీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇప్ప‌టికీ ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తూనే ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement