Friday, May 3, 2024

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు

వికారాబాద్, (ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో వాన దంచికొట్టింది. కేవలం ఒక్క పెద్దముల్ మండలంలో మాత్రం వర్షం కురియలేదు. మొత్తం 19 మండలాలకు గాను కొడంగల్‌లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్లు, పరిగిలో 7.4 సెంటీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అత్య‌ల్పంగా మోమిన్ పేటలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement