Monday, July 15, 2024

స్థానిక సంస్థల్లో ఖాళీల భర్తీపై హైకోర్టులో పిల్‌.. విచారణ ఏప్రిల్‌ 27 కి వాయిదా

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలుకు ఎన్నికలు ఎన్నిరోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 27 కి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఖాళీల భర్తీని వెంటనే చేపట్టాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది మాచర్ల రంగయ్య వాదించారు.

ఖాళీల భర్తీ నోటిఫికేషన్‌ వెంటనే జారీ చేసేందుకు తగు ఆదేశాలు జారీచేయాలని కోర్టును అభ్యర్థించారు. 344 గ్రామ సర్పంచ్‌, 300 ఉపసర్పంచ్‌, 5329 వార్డు మెంబర్లు, 9 జడ్‌పీటీసీల పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన కోర్టుకు నివేదించారు. పిటిషనర్‌ అభ్యర్థనను విన్న కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, పంచాయతిరాజ్‌ కమీషనర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement