Tuesday, May 7, 2024

హెచ్‌సీఎల్‌ బంపరాఫర్‌, ఫ్రెషర్స్ కు గుడ్‌ న్యూస్‌.. కనీస వేతనం 4.25లక్షలు

భారత ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫ్రెషర్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశీయ ఐటీ రంగంలో దాదాపు దశాబ్ద కాలం తరువాత ఫ్రెషర్ల వార్షిక వేతనాలు పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఐటీ సంస్థలు వార్షిక ప్యాకేజీని 15 శాతం నుంచి 60 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌ పెరిగి సాఫ్ట్ వేర్‌ ఆట్రిషన్‌ కూడా భారీగా పెరిగింది. దీంతో కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఉద్యోగులు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఫ్రెషర్స్‌ను కూడా తీసుకుంటున్నాయి. నిపునుల వేటలో భాగంగా ఫ్రెషర్స్‌కు కూడా ఈ ఏడాది నుంచి అధిక ప్యాకేజీని ఆఫర్‌ చేస్తున్నాయి.

ప్రస్తుతంఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు కొత్త వారికి రూ.3.50లక్షల నుంచి ప్యాకేజీని అందిస్తున్నాయి. ఈ ఏడాది నుంచి ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకు వార్షిక వేతనం రూ.4.25 లక్షలకు పెంచినట్టు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. డేటా అనలటిక్స్‌, డిజిటల్‌ కంటెంట్‌ వంటి ఆధునిక కోర్సుల కోసం పలు ఇంజినీరింగ్‌ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగిందని, ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసే విద్యార్థులను రూ.6లక్షల వార్షిక ప్యాకేజీతో కంపెనీలో చేర్చుకోనున్నట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement