Wednesday, May 15, 2024

వార్ మెమోరియల్ సందర్శించిన గవర్నర్.. రాష్ట్రపతితో వరుస భేటీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం ఉదయం సందర్శించారు. అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం విజిటర్స్ బుక్‌లో తన సందేశాన్ని రాశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానితో చర్చించినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం గం. 06.50కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో గవర్నర్ భేటీ కానున్నారు. రాష్ట్రపతితో భేటీ మర్యాదపూర్వకమే అయినప్పటికీ, రక్షణశాఖ మంత్రితో భేటీలో ఏయే అంశాల గురించి చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం తన పర్యటన ముగించుకుని విజయవాడకు తిరుగుప్రయాణమవుతారని రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement