Thursday, May 16, 2024

వెంటాడిన కొవిడ్‌ భయాలు.. మార్కెట్ల భారీ పతనం

కొవిడ్‌ భయాలుకు తోడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అలాగే కొనసాగాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో భారీ నష్టాల్లో సూచీలు ముగిశాయి. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీన పటడర మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
వరసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ముగుస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజే భారీగా పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద 8 లక్షల కోట్లు ఆవిరైంది.
సెన్సెక్స్‌ 980.93 పాయింట్లు నష్టపోయి 59845.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 320.55 పాయింట్లు నష్టపోయి 17806.80 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 66 రూపాయలు పెరిగి 54587 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 265 రూపాయలు పెరిగి 68785 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.80 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

దివిస్‌ ల్యాబ్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎం అండ్‌ ఎం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement