మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో మూడవ రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి మహబూబాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డితో పాటు అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో కదిలారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను రేవంత్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పాలన అందిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, టిపిసిసి అధికార ప్రతినిధి వేము నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చెందరరెడ్డి తదితరులున్నారు.
- Advertisement -