Thursday, March 28, 2024

గ‌త 12ఏళ్లుగా సెల‌వు తీసుకోని.. స్కూల్ మాష్టారు

మ‌నం చేసేది ఏ ప‌ని అయినా స‌రే.. వీక్ ఆఫ్ లతో పాటు సెల‌వులు తీసుకోవ‌డం మామూలే..సంస్థ‌లు ఇచ్చే సెల‌వుల‌తో పాటు మ‌న అవ‌స‌రాల‌కి అద‌నంగా కూడా సెల‌వులు తీసుకుంటూ ఉంటాం. అయితే ఓ మాస్టారు మాత్రం గ‌త 12సంవ‌త్స‌రాలుగా ఒక్క సెల‌వు కూడా పెట్ట‌కుండా స్కూల్ కి హాజ‌ర‌యిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఎంత క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర‌యినా కూడా ఏనాడు ఆయ‌న విధుల‌కి డుమ్మా కొట్ట‌లేద‌ట‌. కాగా తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండ సమీపంలోని కారైక్కురిచ్చి మాస్టారు కలైయరసన్ ఘనత ఇది. సింతామణి గ్రామానికి చెందిన ఆయన కారైక్కురిచ్చి గ్రామంలోని హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అంతకుముందు ఆయన కాట్టుమన్నార్‌గుడి, సిలాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు. 2014 నుంచి కారైక్కురిచ్చిలో పనిచేస్తున్న ఆయన గ‌త 12ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. తన పనులను సెలవు రోజుల్లో పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆయన విద్యార్థులు స్కూలుకు రావడానికి ముందే పాఠశాలలో వాలిపోతారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రన్ మాట్లాడుతూ.. కలైయరసన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సెలవు రోజుల్లో ప్రభుత్వం తరపున పాఠశాలకు వచ్చే సంక్షేమ సాయాన్ని కూడా ఆయన విద్యార్థులకు అందిస్తారని చెప్పారు. ఇలాంటి వ్య‌క్తులు చాలా అరుద‌ని ఆయ‌న్ని కొనియాడుతున్నారు పాఠ‌శాల సిబ్బంది.. న‌లుగురితో క‌లివిడిగా ఉంటూ..విద్యార్థుల‌కి అందుబాటులో ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement