Friday, May 3, 2024

Big Story | హరితం, ఓ మణిహారం.. 700 కోట్లతో 179 అర్బన్‌ ఫారెస్ట్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రతిష్టను దేశం నలుమూలలకు చాటిన ప్రతిష్టాత్మక పథకంగా ‘హరితహారం’ శరవేగంతో దూసుకుపోతోంది. తొమ్మిదేళ్ళ కేసీఆర్‌ సర్కారు హయాంతో గడిచిన ఎనిమిదేళ్ళ కాలంగా నిరంతర కార్యక్రమంగా సాగుతోంది. పదేళ్ళ వ్యవధిలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటివరకు 273.33 కోట్ల మొక్కలు నాటి ఘనత చాటారు. అభివృద్ధి, సంక్షేమమే కాకుండా భవిష్యత్తు తరాలకు మరేదైన చేద్దాం.. అనే ఆలోచన మదిలో మెదిలిన వెంటనే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

భవిష్యత్తు తరాలకు భూగోళాన్ని పరిరక్షించడం, పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్దిని చేయడమే ఒక మార్గం. వాతావరణ సమతుల్యం ఉండాలంటే 33శాతం పచ్చదనం తప్పనసరి. పేరుగుతున్న జనాభాతో అవసరాలు పెరిగి అడవులు కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటీవల వర్షపాతం ప్రతియేటా తగ్గిపోతోంది. ఓజోన్‌ పొర క్షీణించిపోతోంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టు-కొని వాటి ప్రభావాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ధిషమైన కార్యాచరణ ప్రణాళికతో ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టింది.

తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24శాతం నుండి 33శాతానికి పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015-16 లో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అంకురార్పణ చేసింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలను, రైతులను భాగస్వాములను చేసి ఒక ప్రజా ఉద్యమంగా మలచి ముందుకు కదులుతోంది. హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్లు- మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. చైనా, బ్రెజిల్‌ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఖ్యాతికెక్కింది. ఈ కార్యక్రమం చేపట్టడంలో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు- జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదు అవుతుంది.

చెట్ల సంరక్షణను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం

- Advertisement -

ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని, సంరక్షణను తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు- చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షించేదుకు హరిత రక్షణ కమిటీ-లను ఏర్పాటు- చేశారు. జియో ట్యాగింగ్‌ ద్వారా మొక్కలను పర్యవేక్షించడం జరుగుతోంది. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌, సంస్థగత ప్లాంటేషన్‌, హోమ్‌ స్టెడ్‌ ప్లాంటేషన్‌, ఆగ్రో ఫారెస్ట్రి ప్లాంటేషన్‌ పేరిట మొక్కలు పెద్ద సంఖ్యలో నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

పర్యావరణ సమతుల్యానికి 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌

సవరించిన పంచాయతీ రాజ్‌ చట్టం 2018, మున్సిపల్‌ చట్టం 2019లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తోంది. సాధారణ బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయించి, పచ్చదనాన్ని విస్తరించేదుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలను నాటడం పూర్తయింది. 2015-16 లో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70శాతం పెరిగిందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం

గతంలో పట్టణాలు, నగరాల్లో పచ్చదనం కరువై, ఉద్యానవనాలు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతోపాటు-, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,275 భృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు- చేసింది. రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచడం జరుగుతుంది. పట్టణాలో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ లను ప్రభుత్వం ఏర్పాటు- చేసింది. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు- చేసింది. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ హరితనిధిలో భాగస్వాములు. వీరందరి నుంచి సేకరించిన మొత్తంలో హరితనిధి ఏర్పాటైంది.

లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాల విస్తరణ

హరితనిధికి నోడల్‌ ఏజన్సీగా అటవీ శాఖ వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం తొడవడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సుమారు ఒక లక్ష కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వనాలను (అవెన్యూ ప్లాంటేషన్‌) ఏర్పాటు- చేశారు. ఈ సంవత్సరం 19.29 కోట్ల మొక్కలను నాటలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ ఏడాది అన్నీ సాగునీటి ప్రాజెక్టుల స్థలాలు, కాలువల వెంట పచ్చదనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement