Sunday, April 28, 2024

మోదీ ఫొటోకి పాలాభిషేకం చేస్తాః హరీష్‌ రావు

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి హరీష్‌ రావు అక్కడే మకాం వేశారు. సీఎం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో రైతు బంధుపై దుష్ప్రచారం చేసినట్టే, ఇప్పుడు దళిత బంధుపైనా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇస్తే ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని మంత్రి హరీష్‌  ప్రకటించారు.

దళితబంధుపై బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.  దళిత బంధును ఆపాలని ఈసీకి లేఖ రాశారని, కోర్టులో కేసు వేశారని  విమర్శించారు. హుజురాబాద్‌లో రైతుబంధు ఎలా ఒప్పైంది? దళితబంధు ఎలా తప్పైంది? ప్రశ్నించారు. రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారని, తాము పది లక్షలు ఇస్తున్నామన్నారు. మిగతాది బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి తెప్పించి ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ లో మరిన్ని నిధులు ఇచ్చి రాష్ట్రం అంతా ఇస్తామని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇస్తే.. తాము కూడా పాలాభిషేకం చేస్తామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

https://twitter.com/TrsHarishNews/status/1426485563427676161

ఇది కూడా చదవండిః దళిత బంధుపై చల్లారని వేడి.. టీఆర్ఎస్‌లో టెన్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement