Sunday, April 28, 2024

Latest | రేపే “హనుమాన్” రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన పాన్ ఇండియా మూవీ హనుమాన్. మూవీ నుంచి రిలీజ్ అయిన‌ సాలిడ్ టీజర్ ప్రేక్ష‌కును ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ ని మే 12 అనుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ ఓ శుభవార్త చెప్పారు మూవీ మేకర్స్. హనుమాన్ విడుదల తేదీ ఎనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10:08 గంటలకు రానున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

అమృతా అయ్యర్‌ కథానాయిక. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ బాణీలు సమకూరుస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement