Friday, May 17, 2024

Jawed Habib: మహిళ నెత్తి మీద ఉమ్మివేసి కటింగ్.. ఇదేం హెయిర్ స్టైల్‌రా బాబు

నేటి యువత హెయిర్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. హెయిర్ విభిన్నంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. మనిషి ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికీ తల పైన ఉండే జుట్టు ఎంతో స్టైల్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే చాలామంది చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వాడుతూ ఉంటారు. హెయిర్ స్టైలిస్ట్ గా ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్న వారిలో జావేద్ హబీబ్ కూడా ఒకరు. అయితే, ఆయన ఓ హెయిర్ స్టైలింగ్ పై నెట్టిజన్లు మండిపడుతున్నారు. ఒక సెమినార్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ముందు ఉన్న ఆడియన్స్ లో ఒక మహిళను స్టేజి మీదికి పిలిచి ఆ మహిళ హెయిర్ కట్ చేస్తున్న సమయంలో విచిత్రంగా ప్రవర్తించారు. ఉమ్ముతో కూడా హెయిర్ కట్ చేయవచ్చు అంటూ మహిళలపై ఉమ్మి దారుణంగా ప్రవర్తించారు. ఇక దీనిపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో జావిద్ కూడా పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కుర్చీ వద్దకు పిలిచాడు. ఇక సెమినార్ లో భాగంగా దువ్వెనతో జుట్టును సరి చేశాడు. హెయిర్ స్టైలింగ్‌లో సూచనలు ఇస్తూనే.. ఉన్నట్టుండి ఆమె జుట్టుపై ఉమ్మి వేశాడు. ఒకవేళ మీరు నటి కొరత ఉంటే, ఉమ్మితోనే శుభ్రం చేసుకుంటానని చెబుతూనే ఆమె తలపై రెండు సార్లు ఉమ్మి వేశాడు. ఉమ్మిలో ఒక పవర్ ఉంటుంది అంటూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement