Friday, April 26, 2024

USA : హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్​కు గడువు పొడగింపు

హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పొడిగించింది. ఈనెల 22తో గ‌డువు ముగిసిపోగా, మ‌రో మూడు రోజులు పొడ‌గించిన‌ట్లు యూఎస్ సీఐఎస్ తెలిపింది. ఇవాళ్టి నుంచి 25వ‌ర‌కు హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదు చేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పించింది.

- Advertisement -

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు ఉత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సి ఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో యూఎస్ సీఐఎస్ వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ-907, ఐ-129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్ లైన్ లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement