Monday, April 29, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) రాత్రి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంక‌డే క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 57వ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్టు 11 మ్యాచ్ లు ఆడ‌గా.. ముంబై 6 మ్యాచ్ లు గెలిచి 5 ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక గుజ‌రాత్ జ‌ట్టు 8 మ్యాచ్ లు గెలిచి, 3 ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement