వాహన రిటైల్ విక్రయాలు మే నెలలో వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధి చెందాయి. అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ద్విచక్ర వాహన అమ్మకాల్లో 9 శాతం, త్రిచక్ర వాహనాల విక్రయాల్లో 79 శాతం, ప్రయాణికుల వాహనాలు 4 శాతం, ట్రాక్టర్లు 10 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 7 శాతం నమోదైనట్లు తెలిపింది.
కరోనాకు ముందు నాటికి మాత్రం ఇంకా అమ్మకాలు చేరుకోలేదు. ఇంకా రెండు శాతం తక్కువగానే అమ్మకాలు నమోదయ్యాయి. టూ వీలర్స్ అమ్మకాల్లో ఇంకా 8 శాతం తక్కువగా, వానణిజ్య వాహనాల విక్రయాల్లో 7 శాతం తక్కువగా నమోదయ్యాయని తెలిపింది.
విద్యుత్ వాహనాల విక్రయాలు మే నెలలో మంచి వృద్ధిని నమోదు చేశాయని ఫాడా తెలిపింది. మొత్తం రిటైల్ అమ్మకాల్లో విద్యుత్ వాహనాల వాఆ 8 శాతంగా ఉన్నాయి. ఈవీ విక్రయాల పెరుగుదలలో ద్విచక్ర వాహనాల వాటా 7 శాతం కాగా, త్రిచక్ర వాహన అమ్మకాలు 56 శాతం పుంజుకున్నట్లు ఫాడా తన నివేదికలో తెలిపింది. పెళ్లిళ్ల సీజన్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెరిగాయని తెలిపింది. జూన్ నుంచి ఫేమ్-2 సబ్సిడీ తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఈవీల అమ్మకాలు పెరిగాయ. గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాలు పె రిగాయని తెలిపింది.
ఏప్రిల్ నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో తగ్గుదల నమోదైంది. కార్లు ఉత్పత్తి పెరగడం, పెండింగ్ ఆర్డర్లను కంపెనీలు డెలివరీ చేయడం, కొత్త మోడళ్లు ఎక్కువగా మార్కెట్లోకి రావడంతో మే నెలలో వీటి అమ్మకాలు పెరిగాయి. టూ వీలర్స్ అమ్మకాలు ఈ సంవత్సరంలో 14,93,234 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వీటి అమ్మకాలు 13,65,924గా ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చితే వీటి అమ్మకాలు 9.32 శాతం పెరిగాయి.
త్రీ వీలర్స్ అమ్మకాలు 79,433గా నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2,98,873 యూనిట్లుగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 70,739 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వాహనాల అమ్మకాలు 77,135గా ఉన్నాయి. మే నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 20,19,414 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2022 మే నెలలో ఇవి 18,33,421 యూనిట్లగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం వాహనాల అమ్మకాలు 10.14 శాతం పెరిగాయి.