Thursday, March 28, 2024

Big Story | నాలుగేళ్లలో 1,129 రైలు ప్రమాదాలు.. భద్రతా నిధిని సమకూర్చని రైల్వేశాఖ

అమరావతి, ఆంధ్రప్రభ: ఒడిస్సా రైలు ప్రమాదం ఘటన తర్వాత భారత రైల్వేల భద్రతపై ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో 2022 కాగ్‌(కంఎ్టోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌) రిపోర్ట్‌ బయట పెట్టిన నిజాలు అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం 2017 నుండి 2021 ఏడాది లోపు దాదాపు 1,129 రైల్వే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిల్లో 156 ప్రమాదాలు సరైన సమయానికి మెయింటెన్స్‌ లేక జరిగాయి.

182 ప్రమాదాలు రై ల్వే మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యం కారణంగా జరిగాయి. ఓవర్‌ స్పీడ్‌ కారణంగా 154 ప్రమాదాలు జరిగాయి. ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యంగా కారణంగా 400 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ యాక్సిడెంట్లు జరిగిన తర్వాత రైల్వే శాఖ వెనువెంటనే విచారణ చేపట్టి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కానీ రైల్వే శాఖ 63 శాతం కేసుల్లో సరైన సమయంలో విచారణా నివేదికలను సమర్పించలేదని కాగ్‌ తప్పుపట్టింది.

- Advertisement -

భద్రతా నిధికి నిధులు సమకూర్చని రైల్వే శాఖ

2017-2018 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం రైల్వే భద్రతానిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి గాను లక్ష కోట్లను కార్పస్‌ ఫండ్‌గా ప్రకటించింది. ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలను ఈ నిధికి కేటాయించాలి. కానీ రైల్వే శాఖ 2017 నుండి 2021 కాలానికి గాను 20 వేల కోట్ల రూపాయలను ఈ నిధికి చెల్లించాల్సి ఉండగా 15,770 కోట్ల రూపాయలను జమ చేయడంలో విఫలమయింది. దీంతో భద్రతా చర్యలు చేపట్టేందుకు విఘాతం ఏర్పడిందని, సరైన సమయానికి సరైన చర్యలు తీసుకోలేకపోయారని కాగ్‌ తప్పు పట్టింది. కాగా నిధులు సమకూర్చకపోవడమే కాక ప్రతి ఏడాది భద్రతకు ఖర్చు చేయాల్సిన 20 వేల కోట్ల రూపాయల్లో దాదాపు 15 శాతం భద్రతేతర పనులకు ఖర్చు చేశారు. ఏడాదికి దాదాపు 2,300 కోట్ల రూపాయల వరకు నిధులను మళ్లించినట్లు కాగ్‌ తేల్చింది.

అసలు రైలు ప్రమాదాలకు కారణాలేంటి?

భారత రైల్వేలు ప్రచురించిన నివేదిక ప్రకారం రైల్వే ప్రమాదాలకు మొదటి కారణం రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం. వివిధ సెక్షన్లకు చెందిన సిబ్బంది తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అధికంగా ప్రమాదాలు జరగుతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే సిబ ్బంది కాకుండి ఇతర వ్యక్తుల వైపల్యం రెండో ప్రధాన కారణంగా పేర్కొంది. మూడో కారణం రైల్వే ఎక్విప్‌మెంట్‌ విఫలమవ్వడంగా పేర్కొంది. నాలుగో కారణం ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేసి ప్రమాదాలకు కారణమౌవడమని పేర్కొంది. యాదృచ్చికంగా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయని, పట్టాలు తెగిపోవడం, వర్షపు నీటకి పట్టాలు కుంగిపోవడం, జంతువులు రైల్వే ట్రాక్‌పైన అడ్డురావడం ఈ కేటగిరీ కిందకు వస్తాయని ఆ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement