Saturday, May 18, 2024

జీఎస్టీపై 17న మంత్రుల బృందం భేటీ.. స్లాబుల సరళీకరణపై చర్చించే అవకాశం

జీఎస్టీలో పన్నుల స్లాబులను సవరించే విషయాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 17న సమావేశం కానుంది. జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల చివరలో సమావేశం అవుతుంది. ప్రస్తుతం జీఎస్టీలో అమలు చేస్తున్న పన్నుల స్లాబుల్లో మార్పులు, స్లాబు రేట్ల సవరించడంపై మంత్రుల బృందం చర్చించనుంది. మంత్రుల బృందం ఇచ్చే నివేదికపై ఈ నెల చివరలో ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కర్నాటక ముఖ్యమంత్రి బస్వారాజ్‌ బొమ్మై అధ్యక్షతన వివిధ రాష్ట్రాలకు చెందిన 7 గురు మంత్రులతో బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందం 2021 నవంబర్‌లో సమావేశమైంది. ప్రస్తుతం జీఎస్టీలో చెల్లిస్తున్న రిఫండ్‌ విధానాన్ని
తగ్గించడం, మరింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం , ఇన్‌పుట్‌ క్రెడిట్‌ భారాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించి , సూచనలు చేయాలని నిర్ధేశించారు. అమల్లో ఉన్న స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా రికమండ్‌ చేస్తారు. ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు రకాల స్లాబులు అమల్లోఉన్నాయి. నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను స్లాబులో ఉంచారు. విలాసవంతమైనవస్తువులను 28 శాతం స్లాబులో ఉంచారు. మిగిలిన వస్తువులు, సేవలను 12, 18 శాతం స్లాబులో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement