Thursday, April 18, 2024

చెన్నైలో గ్రాండ్ గా ధ‌నుశ్ కొత్త చిత్రం- పూజా కార్య‌క్ర‌మాలు

త‌మిళ హీరో ధ‌నుశ్ న‌టిస్తోన్న తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్ . పీరియాడిక్‌ గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్‌ మాతేశ్వరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనుంది. ఈ క్రమంలో చిత్రబృందం ధనుష్‌ అభిమానులకు ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం చెన్నైలో గ్రాండ్‌గా జరుగన్నునాయి. కాగా ఈ ఈవెంట్ వీడియోను సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం ధనుష్‌ కెరీర్‌లో అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాకుండా 1930-40 టైం పీరియ‌డ్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని టాక్‌. ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ధనుష్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీ. వి ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స‌త్య జోతి బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం రూపొంద‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement