Sunday, April 28, 2024

ఢిల్లీలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.. అన్నదానం చేసిన టీడీపీ అభిమాని భానుప్రతాప్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద తెలుగుదేశం పార్టీ అభిమాని భాను ప్రతాప్ ఢిల్లీలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులతో కలిసి గురువారం బాబు 73వ జన్మదిన వేడుకలు జరిపారు.

భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేశారు. చంద్రబాబు వర్థిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 300 మంది రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లకు అన్నదానం చేశారు. 500 మందికి మజ్జిగా అందించారు. చంద్రబాబు వంటి విజనరీ నేత నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement