Monday, April 29, 2024

వ్యాట్‌ తగ్గించిన రాజస్థాన్‌, కేరళ, ఒడిశా ప్రభుత్వాలు.. ప్రధానిని లెక్క చేయని బీజేపీ సీఎంలు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత పలు రాష్ట్రాలు ఆ నిర్ణయాన్ని అనుసరిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌)ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్‌, కేరళ, ఒడిషా ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేరళ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ. 2.41, లీటర్‌ డీజిల్‌పై రూ. 1.36లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.2.48, డీజిల్‌కు రూ. 1.16 తగ్గించింది. ఒడిషా ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.2.23 మరియు డీజిల్‌పై రూ. 1.36లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వాహనదార్లకు పెట్రోల్‌, డీజిల్‌ భారం నుంచి ఊరట కలిగించేందుకు వ్యాట్‌ తగ్గించినట్లు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గించినా, వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలకు సూచించినా ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవిధమైన ప్రకటనా చేయలేదు. బీజేపీ అధికారంలో లోని రాజస్థాన్‌, కేరళ, ఒడిషా ప్రభుత్వాలు కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా వ్యాట్‌ తగ్గించడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement