Sunday, April 28, 2024

రెండు భాష‌ల్లో మేజ‌ర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ – ఓటీటీలో దూసుకుపోతోన్న మూవీ

ఓటీటీలో కూడా దూసుకుపోతోంది మేజ‌ర్ చిత్రం.ఈ చిత్రంలో హీరోగా అడ‌వి శేషు న‌టించాడు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. 2008 ముంబయి దాడుల్లో కీలకపాత్ర పోషించి, అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ద్వారా సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ జంటగా నటించారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క అద్భుతమైన ఫ్రేమింగ్ తో తన మార్క్ చూపించాడు. రెండేండ్ల కింద షూటింగ్ ప్రారంభమై ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన Major ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది..

రెండు భాషల్లోనూ మేజర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని అడివి శేషు పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల తేదీ కంటే ముందే అభిమానుల కోసం దేశంలోని ప్రధాన తొమ్మిది నగరాల్లో ప్రీ ప్రీమియర్ షోలు వేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో ప్రేక్షకులకు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మూవీలో అడివి శేషు, సాయీ మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలను పోషించారు. సోనీ పిక్చర్స్ మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, అలాగే ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement