Monday, May 6, 2024

నేటి బంగారం ధ‌ర‌లు- స్థిరంగా వెండి

నేటి బంగారం ధ‌ర‌ల్లో మార్పు లేదు.. శనివారం నుంచి ఈ రేట్లలో ఎలాంటి మార్పులేదు. దీంతో హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 వద్దనే పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలుగా నమోదవుతోంది. అయితే వెండి ధరలు మాత్రం వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.60,400గా పలుకుతోంది.
హైదరాబాద్‌తో మార్కెట్లో ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధానిలో రూ.46,900గా పలుకుతుండగా… 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,150గా ఉంది. అలాగే కేజీ వెండి రేటు స్థిరంగా రూ.55 వేల వద్ద ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 వద్ద.. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేలుగా రికార్డవుతున్నాయి. సిల్వర్ రేట్లు సైతం స్థిరంగా రూ.60,400గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement