Monday, April 29, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు…చూసి కొనండి

బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా మాత్రం బంగారం ధర నిలకడగా ఉంది. కాగా ఇప్పుడు మళ్ళీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పైకి లేవడం బులియన్ మార్కెట్ లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై 210 రూపాయలు పెరిగి 46,0040 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు పెరిగి 42,200కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర 900 రూపాయలు పెరిగి 72,500 చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement