Friday, April 26, 2024

Gold Price Today : స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు

బంగారం ధ‌ర‌లు గ‌త మూడు రోజులుగా స్థిరంగానే కొన‌సాగుతున్నాయి. ఇప్పటికే దసరా సందర్భంగా గోల్డ్ కొనుగోళ్లు పెరగగా.. ఇప్పుడు దీపావళికి ఆ సాంప్రదాయం కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి.. రేట్లు ఏమైనా దిగొస్తాయా, డిమాండ్ పెరిగినందున మరింత పెరుగుతాయా అనేది స్పష్టత లేదు. ఏదేమైనా అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల పరంగా చూస్తే.. ఇప్పుడు కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 3 రోజులుగా ధరలు పెరగకపోవడం దీనిని బలపరుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 వద్ద ఉంది. అంతకుముందు రోజు కూడా ధర ఇంతే. ఇక 24 క్యారెట్లకు చెందిన పసిడి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. తులం బంగారం ధర రూ.52,200 పలుకుతోంది. ఇక సిల్వర్ ధరలోనూ ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. అక్టోబర్ 5న రూ. 67 వేలు ఉన్న కేజీ వెండి ధర.. ఇప్పుడు రూ.66 వేలకు చేరడం విశేషం. అక్టోబర్ 6, 8 తేదీల్లో రూ. 500 చొప్పున తగ్గుకుంటూ వచ్చాయి. అక్టోబర్ 4న మాత్రం రికార్డు స్థాయిలో ఒకే రోజు ఏకంగా రూ.4200 మేర ధర పెరిగింది. అక్టోబర్ 1న రేటు రూ. 62 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ. 66 వేల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement