Friday, April 19, 2024

Gold Price : పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

బంగారం ధరల పతనానికి బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.100 పెరిగి రూ.46,760కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.51 వేలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్ లో సిల్వర్ రేటు కూడా జిగేల్ మంది. కేజీ సిల్వర్ రేటు రూ.300 పెరిగి రూ.58,500 వద్ద నమోదైంది. బంగారం వెండి ధరలు హైదరాబాద్‌లో మాత్రమే కాదు… అటు ఢిల్లీ మార్కెట్ లోనూ పెరిగాయి. ఢిల్లీలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,900కి ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.51,160కి చేరుకుంది. ఢిల్లీలో సిల్వర్ రేటు భారీగా పెరిగింది. కేజీ సిల్వర్‌పై అక్కడ రూ.720 మేర ధర పెరగడంతో.. ఈ రేటు రూ.53,220కి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement